Posts

Showing posts from November, 2024

శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్

Image
ఇరుముడికట్టులో ఆ వస్తువులు తేవొద్దని బోర్డు విజ్ఞప్తి . * ట్రావెన్ కోర్​ దేవస్వమ్ బోర్డు కీలక సూచన- ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్​వాటర్ తీసుకురావొద్దని విజ్ఞప్తి * శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్​కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్​వాటర్ తీసుకురావొద్దని కోరింది. ఈ మేరకు ట్రావెన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. త్వరలో ఈ విషయంపై సర్య్కులర్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొచ్చి, మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు! కర్పూరం, అగరబత్తీలు పూజా సామగ్రి అయినప్పటికీ, వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్​కోర్ దేవస్వామ్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నిదానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయి. వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే ద...