"కొండగట్టు RTC బస్సు బోల్తా "
జగిత్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొండగట్టు దగ్గర ఇవాళ మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిని జగిత్యాల హస్పిటల్ కి తరలించారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న SP సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరకున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గాయకులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
బస్సులో 40 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘాట్ నుంచి మరో నిమిషంలో ప్రధాన రహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికులంతా డ్రైవర్ వైపు ఒరగడంతో బస్సు బోల్తా పడింది. కొండగట్టులో దర్శనం ముగించుకుని జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు ప్రయాణికులు.

Comments
Post a Comment