కారు చోరీ కవిత ఓటమి

*

*కారులో... చోరులు...కవిత ఓటమిపై విచారణ...ఇంటి దొంగల పని పట్టేందుకు రంగం సిద్ధం...శ్రీలంకలో లో సమావేశమైన నలుగురు ఎమ్మెల్యేలు...ఉద్యోగ సంఘాల నేత పై టిఆర్ఎస్ అధినేత మూడో కన్ను...*


 *ఆ 20 కోట్లు ఏమయ్యాయి...*


 నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి కి కారణాలపై  విచారణ చేస్తున్నారు. పార్టీ అధినేత రంగములోకి దిగారు. 

పీ ఏ ల నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ల వరకు గురి పెట్టారు. వీరిలో మండలం స్థాయి నేత నుంచి ఉద్యోగ సంఘాలు నేతలు. కుల సంఘాల నేతలు!  ఎమ్మెల్యేలు సైతం ఉండడంపై పార్టీ అధినేత సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని పార్టీ నాయకులు ప్రతినిధులు సైతం ఆందోళన చెందుతున్నారు.


*ఎమ్మెల్యేల హస్తం...*


పార్టీని భుజాల మీదా మోయాల్సిన ఏమ్మేలూ ఏకంగా పార్టీకే పంగనామాలు పేట్టారు. వీరి నుంచి అందాల్సిన ఆదేశాల్లో తేడా రావడముతో మండలా స్తాయి నేతలు సైతం గాడి తప్పారు అనేది నిజం.

కవిత పై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆమె ఓటమి లక్ష్యంగా నలుగురు ఎమ్మెల్యేలు శ్రీలంకలో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనిపై ఇప్పటికే అధిష్టానం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. నామినేషన్  చివరి తేదీ రోజు  రైతులు  175 మంది  ఇది నామినేషన్లు  వేసినట్లు  తెలియగానే  ఒక ఎమ్మెల్యే  డాన్స్ చేయడం  మరో ఎమ్మెల్యే  అత్యంత సన్నిహితులకు  విందు ఇవ్వడం  మరో ఎమ్మెల్యే  దరిద్రం వదిలింది అంటూనే చిందులు తొక్కి దేసి చికెన్ మందు పార్టీకి ఆదేశాలివ్వడం అక్కడ ఉన్న పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది ఈ ఎమ్మెల్యేలు  ఒకరిని ఒకరు  మాట్లాడుకుని  శ్రీలంక టూర్ లో  ప్రత్యేకంగా  సమావేశం అయ్యారు  వీరంతా  ఈ ఎన్నికల్లో  అని చేయకూడదని  ఎట్టి పరిస్థితుల్లో  శని వదులుకోవాల్సిందే నని  కరాకండి గా  ప్రమాణం చేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం  బయటకి  పోక్కీ చివరికి  అధినేత చెంతకు చేరింది.  దీనిపై  పూర్తి వివరాలు  సేకరించిన అనంతరమే  చర్యలుంటాయని  పార్టీ వర్గాల చర్చ.


*పీ ఏ లా పని తీరు...*


సహాయంగా ఉంటూ ప్రజా సేవా చేయాల్సిన సేవకులే కక్కుర్తికి చేయి చాపినట్లు తేలుస్తుంది. కవిత సహాయకులుగా పని చేసిన ముగ్గురు పిఏ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి నుంచి కుల సంఘాలకు చేరాల్సిన సొమ్ము సగానికిపైగా వారి పక్కనున్న వారి జేబులోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎన్నికల అనంతరం ఈ విషయంపై రెండు సంఘాల నాయకులు సరాసరి కవిత వద్దకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. దీంతో లెక్కలు తీసి అసలు దొంగలు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగానే చర్చించుకోవడం విశేషం. ఇద్దరు సహాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే నిజంగా పని చేసే నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడి దారి తప్పింది వాస్తవం.


*ఉద్యోగ అ సంఘం నేత పై కన్ను...*


తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచే కవిత టి ఎన్ జి ఓస్ ఉద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారి సమస్యలపై స్పందిస్తూ వెన్నంటే ఉన్నారు. ఉద్యోగ సంఘాల పై భరోసా పెట్టుకున్న కవిత  ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించిన ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులంతా అత్యధిక శాతం ఓట్లు బిజెపికి వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం టి ఎన్ జి ఓస్ నేతలు ముగ్గురు,  అన్ని తానై చక్రం తిప్పినా  లక్షల రూపాయలు దారి తప్పినాయి. వాస్తవంగా శాసనసభ, విధాన సభ ఎన్నికల్లో సైతం ఉద్యోగ సంఘం నేతల అన్నీ తానైనప్పటికీ  అధికారపార్టీకి ఓట్లు వేయించడంలో లో విఫలం అయ్యారు. ప్రత్యేకంగా పార్లమెంటు ఎన్నికల్లో లక్షలాది రూపాయలు చేతులు మార్చిన టీఎన్జీవో నేతలు ఉద్యోగులతో ఓట్లు వేయించడంలో మాత్రం  పూర్తిగా విఫలం అయ్యారు అనేది సత్యం. అయితే ఈ తంతు వెనుక నోట్ల చెయ్యి మారలేదు అనేది ఉద్యోగుల్లో లో జరుగుతున్న చర్చ.


*" సహా" యాకులు..*


 కవితకు ప్రత్యేక సహాయకులుగా పని చేస్తున్న ముగ్గురు పీ ఏ లలో ఇద్దరి ప్రవర్తన వివిధ స్తాయిలో  వివాదాలకు కారణమయ్యారు. ఒకరు స్థానికులు కాకపోవడంతో పాటు పార్టీ శ్రేణులను నాయకులను సంతృప్తి పూర్తిగా విఫలమయ్యారు. అలాగే క్షేత్రస్థాయిలో పని చేసిన వారిని నిర్లక్ష్యం చేయడం అసలు కారణం. ఇదిలా ఉంటే రెండో సహాయకుడు ఏకంగా తన కుల, వర్గాలకు మాత్రమే కావలసినంత అప్పగించి మిగిలినవారికి మొండి చేయి చూపించినట్లు సమాచారం. ఈ వ్యవహారం సరాసరి కొందరు సంఘాల నాయకులు పార్టీ నేతలకే ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే ఇప్పటికే దీనిపై అంతర్గతంగా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 


*కుల సంఘాలా నే"తలలు" ...*


ఇక కుల సంఘాల పేరుతో 24 గంటల పాటు కవితక్క అక్క పేరు చేప్పూకూనే నాయకులు తమ అక్కసును వెళ్లగక్కారు. పగలంతా trs జండా పట్టి చీకట్లో మాత్రం కమలూ చేశారు.  పార్టీ నుంచి వచ్చిన సొమ్మును ఎక్కడికక్కడ తమ అనుచరులకు అప్పగించి సొమ్ము చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పని చేయలేక పోవడముతో  దీని ప్రభావం ఓటర్ ను ఏ మాత్రం అవగాహన కల్పించకపోవడం,  సంతృప్తి పరుచుకోవడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగి కవిత ఓటమికి కారణమయ్యాయి. 


*రూ.20 కోట్లు ఏమాయ్యాయీ....*


నమ్మకంతో తో ఉన్నారని వెంకన్న 20 కోట్ల రూపాయలు అప్పగిస్తే పూర్తిగా లెక్కలు గాడి తప్పిన ట్లు తెలుస్తుంది కుల సంఘాలు,  విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు,  జర్నలిస్టుల పేరుతో చేతులు మారిన ఈ సొమ్ము ఏమైంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అసలు ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరికి వారే సొమ్ము చేసుకున్నారనే ది కనిపిస్తున్న వాస్తవం.


 *గెలుస్తామని ధీమాతో ఇస్టా రాజ్యం....*


 శాసనసభ ఎన్నికల్లో ఏడు స్థానాలు భారీ విజయంతో టిఆర్ఎస్ గేలీచీన సంగతి తేలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఎట్లా పనిచేసిన ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల ఓట్ల మెజారిటీతో ఎంపీ కవిత గెలుస్తుందని ధీమా కొందరు నేతలు ఇష్టారాజ్యంగా పని చేశారు. పి ఏ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. డబ్బుల పంపిణీ ఇదే తంతు కొనసాగించి టిఆర్ఎస్ పార్టీ కొంప ముంచారు. చివరికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు తమ బుద్ధిని బయట పెట్టిన వారు ఇప్పుడు బట్టబయలు అవుతున్నారు.

ఇది ఇలా ఉంటే పార్టీ అధిష్టానం అంతర్గత విచారణ చేస్తున్నప్పటికీ ఏ మాత్రం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు మనం  వేచి చూడల్సిందే మరి.....

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"