"స్నాప్ డీల్ షాపింగ్ మోసాలు"ఫ్రాడ్స్

జనం కోసం మనం న్యూస్:హైదరాబాద్

*ప్రజలకు విజ్ఞప్తి. మీరు స్నాప్ డీల్ వెబ్ సైట్ లో ఏవైనా వస్తువులు కొంటున్నారా లేదా కొన్నారా. జాగ్రత్త. మీరు సైబర్ నేరస్థుల వలలో పడి మోసపోవచ్చు*
📍స్నాప్ డీల్ వెబ్ సైట్ లో మీకు నచ్చిన వస్తువుని ఆర్డర్ చేస్తారు. 
📍ఆ వస్తువు మీ వద్దకు చేరడానికి మీరు మీ పూర్తి అడ్రస్ (ఆఫీస్ లేదా ఇల్లు), మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కూడా ఇస్తారు.
📍మీ అడ్రస్ కి ఆ వస్తువు వస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. సంతోషం.
📍సరిగ్గా 2 లేదా 3 రోజుల తర్వాత మీకు ఒక అపరిచిత వ్యక్తి నుండి కాల్ వస్తుంది. మీ పేరు అడ్రస్ వివరాలు అన్ని చెప్పి మీరు స్నాప్ డీల్ లక్కి డ్రా లో ఒక 'కారు' గెలుచుకున్నారు అని చెప్తారు.
📍మీరు 4 రోజుల కిందటే స్నాప్ డీల్ లో వస్తువు కొన్నారు కాబట్టి, మీ అడ్రస్ వివరాలతో ఒక వ్యక్తి కాల్ చేసి కారు గెలుచుకున్నారు అంటే మీరు నమ్ముతారు.

📍మీరు నమ్మారంటే ముందుగా కారు రిజిస్ట్రేషన్, కారు డెలివరీ, టాక్స్ ఇలా రకరకాలుగా మీ నుండి డబ్బులు గుంజుతారు. 

📍ఇది మోసం అని గ్రహించండి. స్నాప్ డీల్ మంచిదే కావచ్చు. కానీ మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా మోసపోవచ్చు. జాగ్రత్త.

📍ఈ విషయం అందరికి తెలియ చేయండి.🙏
       *తెలంగాణ రాష్ట్ర పోలీస్*

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"