పాఠశాలలు ఫిజులు వ్యాపారం గా చేస్తున్నారు

జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా న్యూస్:ఆర్మూర్ నరేష్ .                                             నేటి పాఠశాలలు విద్యావ్యవస్థను వ్యాపారంగా మలుచుకుంటున్నాయి  అదిక ఫీజులు వసులు చేస్తు దోపిడి చేస్తున్నారు పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలి నూతన రాష్ట్రంలో పాఠశాల విద్య(10+2)- ఫీజుల దోపిడి- ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి .


హైదరాబాద్ లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో(10+2) అప్పర్ లిమిట్ 50 వేలు, జిల్లాల్లో 25 వేలు సీలింగ్ ఉండాలి. ఉల్లంఘించిన విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.- 


👉🏻తెలంగాణ లో ఫీజుల దోపిడికి అడ్డే లేకుండ పోతుంది,నూతన రాష్ట్రంలో 4 ఏళ్లుగా కేజీ నించి పీజీ వరకు ఒక్క ఉపాధ్యాయ పోస్టు నింపిన పాపాన పోలేదు .


👉🏻కామన్ స్కూల్ విధానం నా డ్రీమ్ అని ప్రాగల్బాలు పలికిన కేసీఆర్, ఇపుడు కులాల వారీగా గురుకులాలు పెట్టడం దేనికి సంకేతం  


👉🏻62 లక్షల మంది విద్యార్థులుండే ఈ రాష్ట్రంలో కేవలం  2 లక్షల మందికి కూడా సరిపోని 500 గురుకులాలు  పెట్టి భ్రమలు కల్పిస్తుంది గురుకులాల పేరుతో  రాష్ట్రంలో డ్రామా నడుస్తుంది .


👉🏻గురుకులాలలో అసాంఘిక కార్యకలాపాలు, అవినీతి ,స్వేరో పేరుతో దౌర్జన్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.


   👉🏻 హైదరాబాద్ నగరంలో స్కూల్ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు రోడ్లెక్కి నెత్తి నోరు కొట్టుకున్నా, తిరుపతి రావు కమిటీ పేరుతో కాలయాపన చేసి  ఉన్న అధిక ఫీజులను తగ్గించకపోగా 10 శాతం పెంచుకోమని చెప్పడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం.


 👉🏻హైదరాబాద్ లో  అప్పర్ లిమిట్ 50 వేలు, జిల్లాల్లో 25వేలు గా స్కూల్ ఫీజును ఫిక్స్ చేయాలి అని అందులో ప్రైమరీ, హై స్కూల్,inter ఫీజులు ను అంతకు మించకుండా వెంటనే  జీవో తేవాలని, ఉల్లంఘించిన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి.


 👉🏻  ఫీజులు దోచుకునే అక్రమార్కులను వదిలేసి ఉపాధికోసం తక్కువ ఫీజులు తీసుకునే మధ్య తరగతి విద్యా సంస్థలు ను వేధించడం సరికాదు


👉🏻  తెలంగాణ రాకముందు కార్పొరేట్ విద్యాసంస్థలు నియంత్రణ లో వుండేవి. ప్రభుత్వం శ్రీచైతన్య, నారాయణ యజమానులుకు లొంగిపోవడం ఆందోళన కలిగిస్తుంది  కనీసం వాటి టైమింగ్స్ ని కూడా నియంత్రణ చేయడం లేదు. తెలంగాణ జిల్లాల్లో 200 శ్రీచైతన్య, నారాయణ స్కూళ్ల ను అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ్. వాటిని అనుమతించే ప్రసక్తే లేదు. ఆ స్కూళ్ల ను ఏబీవీపీ అడ్డుకుంటుంది.


👉🏻ప్రో. నిరదరెడ్డి కమిషన్ రిపోర్టు ను అమలు చేసి తెలంగాణ బిడ్డల చావులకు స్వస్తి పలకాలి.


👉🏻ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృ భాషలోనే జరిగేటట్లు చట్టం చేయాలి.

👉🏻NCERT జరిపిన నేషనల్ అచివమెంట్ సర్వే లో  తెలంగాణ లో 8 వ తరగతి చదివే విద్యార్థి 3 వ తరగతికి చెందిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోతున్నారు. ఇది దేశంలో 62 శాతం గా ఉంటే తెలంగాణ లో 32 శాతం మాత్రమే ఉండటం నాణ్యతను తెలియజేస్తుంది.


👉🏻ప్రభుత్వం, ప్రైవేటు రెండు రంగాలు పోటీపడి నాణ్యమైన విద్యను సమాజానికి అందించాలి.

👉🏻 ఫీజులు తగ్గించే వరకు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం


ఏబీవీపీ- తెలంగాణ

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"