ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత సదస్సు

జగిత్యాల జిల్లా జనం కోసం మనం న్యూస్ : మల్లాపూర్ మండల్ మోగిలిపేట గ్రామ పంచాయతీ కార్యలయం లో ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ తో రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లతో ఎస్సై రవీందర్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని అన్ని రకాల పత్రాలు ఉంచుకొని డ్రైవ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్ పోలీస్ సిబ్బంది సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.