Posts

Showing posts from June, 2020

రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి

Image
జనం కోసం మనం న్యూస్: మెటుపల్లి సురక్షా హాస్పిటల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళకి మెరుగైన చికిత్స కోసం ఏ+ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారనే సమాచారం తెలుసుకున్న, సిరిపూర్ గ్రామానికి చెందిన లిటిల్ ఫ్లవర్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి మిత్రుడు మారిశెట్టి మహేష్, స్వచ్చందంగా సిరిపూర్ నుండి జగిత్యాల రక్త నిధికి కి వెళ్లి ఏ+ పాజిటివ్ రక్తదానం చేసి వారి ఉదార స్వభావన్ని చాటుకోవడం జరిగింది. పేషంట్ మేలుకై స్వచ్చందంగా ఏ+ పాజిటివ్ రక్తదానం చేసిన శాశ్వత రక్తదాత మారిశెట్టి మహేష్ కి పలువురు హృదయ పూర్వకమైన అభినందనలు తెలియజేశారు.

కరోనా కు భారత లో డ్రగ్ రిలీజ్

Image
జనం కోసం మనం. న్యూస్   *గుడ్​న్యూస్​:కరీనా కు భారత్ లో డ్రగ్ రిలీజ్* కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. యాంటీవైరల్​ డ్రగ్​ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. *కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది.* వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం 'ఫవిపిరావీర్​' అనే ఔషధాన్ని ఆవిష్కరించింది ఫార్మాస్యూటికల్ సంస్థ గ్లెన్​మార్క్. ఫాబిఫ్లూ బ్రాండ్​ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్ గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది. వైద్యుల సలహా తప్పనిసరి భారత్​లో కరోనా రోగులు నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో అనుమతి పొందిన మొదటి డ్రగ్ 'ఫాబిఫ్లూ' అని గ్లెన్​మార్క్ ప్రకటించింది. ఈ మందును వైద్యుల సలహాపై మాత్రమే వాడాలని సంస్థ స్పష్టం చేసింది. మొదటి రోజు 1,800 మి.గ్రా మోతాదులో రెండు సార్లు చొప్పున మొదలు పెట్టి... 14వ రోజునాటికి రోజుకు రెం