మదర్ ప్రతిభ సేవ స్వచ్ఛంద పౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణ

జనం కోసం మనం న్యూస్:



మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో మదర్ ప్రతిభ సేవ స్వచ్ఛంద పౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి  ప్రారంభించడం జరిగింది.ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు ఇది చక్కటి అవకాశమని ఇలాంటి కార్యక్రమం మన గ్రామంలో ప్రారంభించినందుకు మదర్ ప్రతిభ ఫౌండేషన్ వారికి సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ గారు కృతజ్ఞతలు తెలిపారు.మదర్ ప్రతిభ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీ లో సంస్థ సేవా కార్యక్రమాలు చేయుటకు ఆసక్తి ఉన్న మహిళలు కావాలని వారికి మా సంస్థ నుంచి ప్రతి నెల వేతనం ఇవ్వబడును.45 రోజుల్లో పూర్తి చేసుకున్న ప్రతి మహిళలకు 35 శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లు అందజేస్తామని మరియు సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి,కార్యదర్శి ముజీబ్,వార్డు సభ్యులు నాగార్జున రెడ్డి,మండల కో ఆర్డినేటర్ సురేఖ,జిల్లా కో ఆర్డినేటర్ సుమలత, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"