ట్రాఫిక్ రూల్స్ తప్పుతే కేసులు తప్పదు జగిత్యాల పోలీస్

 జగిత్యాల జిల్లా : అర్జున్ జనం కోసం మనం జగిత్యాల ప్రతినిధి





ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ వాహనాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్., 10కంటే ఎక్కువ ఈ-చలాన్స్ పెండింగ్ ఉన్న వాహనాలపై చార్జ్ షీట్ దాఖలు చేసి సంబంధిత వాహన యజమానులు కోర్ట్ లో హాజరుపరచడం., 3 కంటే ఎక్కువ ఈ- చలాన్స్ పెండింగ్  ఉన్న వాహనాలను సీజ్ చేయడం., గత నాలుగు రోజులుగా సుమారు 2581 మoది వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ-చాలన్స్ ను పే చేసి వాహనాలు సీజ్ కాకుండా చూసుకోవడం జరిగింది., వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ వారి కి సహకరించాలి.


జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు.


ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విధించిన ట్రాఫిక్ ఈ-చాలన్స్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు తెలిపారు., ఇందులో భాగంగా జిల్లా లో గడించిన నాలుగు రోజులుగా సుమారు 2581మoది వాహనదారులు తమ యొక్క వాహనాల పై ఉన్న ఈ-చాలన్స్ ను చెల్లించి వాహనాల సీజ్ కాకుండా చూసుకోవడం జరిగిందని  ఇదే విధంగా తమయొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను సకాలంలో చెల్లించాలని కోరారు.మూడు కంటే ఎక్కవగా ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ లో ఉన్న  వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని సదరు వాహనదారులు సకాలంలో తమ యొక్క పెండింగ్ ఈ-చాలాన్స్ ను చెల్లించాలని లేనిపక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, అదే విధంగా 10 కంటే ఎక్కువ ట్రాఫిక్ ఈ చాలన్స్ పెండింగ్ ఉన్న వాహనాలను జిల్లావ్యాప్తంగా గుర్తించడం జరిగిందని సదరు  వాహనాలపై దారులపై చార్జిషీటు దాఖలు చేసి సంబంధిత వాహన యజమానుల ను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలపై విధించబడిన ఈ-చాలాన్స్ ను వెంటనే మీసేవ, ఈసేవ, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలన్నారు., వాహన దారులు తమ యొక్క వాహనాలపై ఉన్న పెండింగ్ ఉన్న చాలన్స్ ను echallan.tspolice.gov.in సైట్ లో చూసుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"