Posts

Showing posts from September, 2019

బతుకమ్మ సంబరాలు

Image

కాళోజి సేవలు చిరస్మరనియం

Image
జనం కోసం మనం న్యూస్: జగిత్యాల్ జిల్లా *''కాళోజి సేవలు చిరస్మరనీయం"*  *తెలంగాణ జాగృతి యూత్* *జిల్లా అధ్యక్షుడు* *గనవేని మల్లేష్ యాదవ్*  ప్రజా కవి కాళోజి నారాయణ రావు  చేసిన  సేవలు  చిరస్మరనీయoగా నిలిచి పోతాయని  తెలంగాణ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..  ప్రజా కవి కాళోజి 105 వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో కాళోజి చిత్ర పటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా జాగృతి యూత్ జిల్లా ఆద్యక్షుడు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమం కోసం  ప్రజల ఆర్తి,ఆవేదన,ఆగ్రహం  అయన గేయాలలో  రూపు కట్టాయని అందుకే అయన తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం ప్రతి ధ్వని గా కొనియడా బడతారని తెలిపారు.. పుట్టుక నీది చావు నీది అని బ్రతుకంత తెలంగాణకిచ్చిన మహానీయడాని కొనియాడారు.. ప్రజా సమస్యలే లక్ష్యంగా అయన రచనలు ఉండేవని.నిజం నిరంకుశత్వం పై కలంతో గలమెత్తిన పోరాట యోధుడని, అందుకే *ప్రజాకవి* గా  బిరుదు పొందిన మహానీయుడని  కొనియాడారు. కాళోజి ఆశయాలను తెలంగాణ జాగృతి కొనసాగిస్తుందని తెలిపారు... ఈ కార్యక్ర

వేములకుర్తి లో మట్టి గణపతులు పంపిణీ

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా ఇబ్రహిపట్నం/న్యూస్:2/10/19 *మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన యూత్ సభ్యులు*  మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో వేములకుర్తి గ్రామంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ.  వినాయక చవితి సంధర్భంగా గణపతి పూజ చేసుకునేవారికోసం యూవతేజ యూత్ వారి ఆధ్వర్యంలో  మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు రఘు, సంజీవ్, శ్రీనివాస్, లక్ష్మినర్సయ్య, ప్రతాప్,రాజశేఖర్, శ్రీధర్, అజయ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతులకై జై కొడుదాం

Image
జనం కోసం మనం న్యూస్ విద్యాలయం లో మట్టి గణేష్ తో చిన్నారులు జగిత్యాల్ జిల్లా జనం కోసం మనం న్యూస్:మల్లాపూర్ మండల్ రాఘవపేట్ లో శారదా విద్యాలయం లో మట్టి వినాయకుల ప్రతిమలను విద్యార్థులతో చేయించారు.స్థానిక పదిమంది విద్యార్థులు  ఉత్సహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మారుతి  మాట్లాడుతూ, మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ప్టాస్టర్‌ ఆఫ్‌ పేరిస్‌తో చేసిన వినాయక విగ్రహాల వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు.కరెస్పాండెంట్ మహేష్ మాట్లాడుతూ రసాయనిక రంగుల వల్ల శ్వాసకోస, జీర్ణసంబంద వ్యాధులు ఏర్పడతాయ న్నారు. ఈ రంగాల్లో కాల్షియం, మెగ్నిషియం, సీసం, కోబాల్ట్‌ వల్ల జలచరజీవులు ప్రమాదానికి గురవుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు