Posts

*||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించాలని గోవింద్ నాయక్‌ అన్నారు||*

Image
  ⚪జగిత్యాల జిల్లా ⚪ సిర్పూర్ *||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించాలని  గోవింద్ నాయక్‌ అన్నారు||* ◻️ప్లాస్టిక్ వినియోగం జీవకోటికి ప్రాణ సంకటంగా పరిణమించిందని సిర్పూర్  గ్రామ సర్పంచ్ గోవింద్ నాయక్  అన్నారు. ◻️పంచాయతీలో శుక్లవారం ప్లాస్టిక్ నిషేధం పై పంచాయతీ సర్పంచ్ గోవింద్ నాయక్ కార్యదర్శి E.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ◻️సర్పంచ్  మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ గోవింద్ నాయక్ అన్నారు. ◻️కిరాణా షాప్ /ఇతర దుకాణాల సముదాయాల యజమానుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ◻️ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. E రంజిత్ కుమార్,సర్పంచ్ గోవింద్ నాయక్,గ్రామ పంచాయతి సిబ్బంది.గ్రామం లోని దుకాణాల యజమానులు పాల్గొన్నారు. *JANAM KOSAM MANAM*
Image
మల్లాపూర్ ◆వాసవి క్లబ్ జెమ్స్ మల్లాపూర్  ఆధ్వర్యంలో  ◆ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి సందర్బంగా మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్  పాత సుదర్శన్&సుకన్య గార్ల పెండ్లి రోజు సందర్బంగా ◆ మల్లాపూర్ మండలం లోని సిర్పూర్ గ్రామానికి చెందిన దండుగుల కళ్యాణ్ అను బాబుకి మూత్ర పిండాల సమస్య తో  బాధ పడుతున్న విషయం తెలుసుకొని  ◆మన వాసవి క్లబ్ జే మ్స్  తరుపున 5000/- రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగింది.ఇట్టి  కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు :మేడి రాకేష్ గుప్తా మండల ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు : శివరాంకిషన్ గుప్తా మాజీ అధ్యక్షులు:శివ శ్రీనివాస్ గుప్తా మరియు సభ్యులు కస్తూరి సంతోష్. మైలారపు నాగభూషణమ్. మైలారపు నరేష్.పాలకుర్తి రాము. అక్షింతల లక్ష్మీనారాయణ. సిర్పూర్ గ్రామ సర్పంచ్ :భూక్యా గోవింద్ నాయక్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు: ఏనుగు రాంరెడ్డి  పాల్గొన్నారు *JANAM KOSAM MANAM NEWS*

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Image
■ మల్లాపూర్ మండలం సిర్పూర్ మరియు మల్లాపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు . సిర్పూర్ క్లిక్ ◆ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులని మోసం చేసి వరి కొనుగోలు చేయనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వనికి బరమైనప్పటికీ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ■దేశంలో వరి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, దానికి ఉదాహరణ రోజు మన బార్డర్లో పక్క రాష్ట్రాల వందలాది ధాన్యంతో ఉన్న లారీలను మన చెక్ పోస్టుల్లో నుండి మన పోలీసులు వెనక్కు పంపించే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ■ఇప్పటికే బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్ర లారీలను, కాంగ్రెస్ పాలిత ఛాతిస్గడ్ లారీలను వెనక్కి పంపిన వీడియోలో ప్రజలందరూ చూసే ఉంటారని అన్న ■వారికీ రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటె వారి రాష్టాల్లో కొనుగోలు కేంద్రాలు ఉంటె అక్కడి రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ■రైతులను ఆదుకునే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని రైతు సోదరులు కేసీఆర్ గారి వెంట ఉండాలని రైత

వాసవి క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో మజ్జికా ప్యాకేట్లు పంపిణీ

Image
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ న్యూస్  వాసవి  క్లబ్  జెమ్స్ మల్లాపూర్   గారి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా వాల్గొండ గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర ఆలయం లో ఉచిత మజ్జిగ ప్యాకేట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు మేడి రాకేష్ గుప్తా సభ్యులు కస్తూరి సంతోష్, కంఠాల శ్రీనివాస్ మరియు  ఆర్యవైశ్య మండల అధ్యక్షులు శివ రాంకిషన్ మాజీ అధ్యక్షులు శివ శ్రీనివాస్ సభ్యులు మేడి సురేందర్, ఎలిగేటి లక్ష్మి నారాయణ, ర్యాగళ్ల వేంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది

కొర్బో వ్యక్స్

Image
జనం కోసం మనం న్యూస్   సిరిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 నుండి 14 ఏండ్లు నిండిన విద్యార్థిని, విద్యార్థులకు కార్బోవాక్స్(కరోనా వ్యాక్సిన్)ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్, ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి,ఏఎన్ఎమ్ రబియా సుల్తానా,ఆశా కార్యకర్త సరిత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ,ఉపాద్యాయులు శంకర్,శ్రీనివాస్,సుధాకర్,మైసయ్య,గణేష్ మరియు ప్రణీతరాణి,శోభారాణి పాల్గొన్నారు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లో వాసవి క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు.

Image
  జనం కోసం మనం న్యూస్ వాసవి క్లబ్ జేమ్స్ మల్లాపూర్ గారి ఆద్వర్యం లో పొట్టి శ్రీ రాములు గారి జయంతి సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యాలయం లో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడారు పిల్లలకు తెలియజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మేడి రాకేష్ గుప్తా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శివ రామ్ కిషన్ గుప్తా  లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ శివ శ్రీనివాస్ గుప్తా సభ్యులు కస్తూరి సంతోష్ గుప్త మేడి సురేందర్ గుప్తా మెడి లక్ష్మీకాంత్ గుప్తా తోట రవీందర్ సార్.పాల్గొనడం జరిగింది

క్రీడాకారులకు టి షర్టులు అందచేత

Image
  *క్రీడాకారులకు టి షర్టులు అందచేత*  రేగుంట గ్రామంలో ని  యువకులలో  ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకి తీయడానికి రేగుంట  ఆల్ యూత్ అసోసియేషన్&స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల సందర్బంగా దాతలు ముందుకు వచ్చి 30 వేల రూపాయల విలువ గల  90 టి షర్టు లు అంద చేశారు 90 మంది యువ క్రీడా కారులకు దాతలు ముందుకి వచ్చి  టి షర్టు లు  అందచేయడం అభినందనీయమని సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య రేగుంట స్పోర్ట్ క్లబ్ మరియు జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ ఎల్లయ్య,కుందేళ్ల నర్సయ్య, మోతె భూమయ్య, నిమ్మల జలందర్, నిమ్మల శరత్, కుక్కుదువ అశోక్  స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు బందెల నరేష్, కత్తి నరేష్, ఏలేటి శేఖర్,వేముల దేవరాజం, మోతె రమేష్, నల్ల వినోద్, ముస్తఫా,  గ్రామ యువకులు పాల్గొన్నారు..