"యధావిధిగా డొమెస్టిక్ సిలెండర్లు."

యధావిధిగా డొమెస్టిక్ సిలెండర్లు....

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు...
అధికారుల పర్యవేక్షణ శూన్యం...
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ సిలెండర్లను, వ్యాపారులు వారి ఇష్టారాజ్యంగా వాడుతున్నారు..


ఒక వైపు హోటళ్లు, రెస్టారెంట్ లు, టిఫిన్ సెంటర్లలో, కేవలం కమర్షియల్ సిలెండర్లను మాత్రమే వాడాలని నియమనిబంధనలు ఉన్న వ్యాపారులు మాత్రం వాటిని తుంగలో తొక్కుతున్నారు..
 బడా వ్యాపారులు కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మకై సామాన్యుడు ఇంటి అవసరాల కొరకు వాడుకునే డొమెస్టిక్ సీలండర్లను పక్క తోవ పట్టిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
అధికారులు ఎటువంటి తనిఖీలు చేయకుండానే, వారి పై అధికారులకు అంత సక్రమంగా ఉంది అంటూ నివేదికలు సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..

దీని వలన సామాన్యుడికి అందవలసిన సబ్సిడీ సైతం దారి మార్లుతుంది..

విచ్చలవిడిగా బడా హోటళ్లు మొదలుకుని చోట మోట హోటళ్లలో సైతం ఈ సిలెండర్ల వాడకం ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అందరిని ఆలోచింపే విధంగా చేస్తుంది..

ఇకనైనా అధికారులు ఏజెన్సీ నిర్వాహకుల పై తగిన చర్యలు తీసుకుని డొమెస్టిక్ సిలెండర్లను పక్క తోవ పట్టించకుండా చేసి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు...

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"