"రాహుల్ దిష్టి బొమ్మ దహనం"

జనం కోసం మనం న్యూస్: రాహుల్ దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు మెట్ పల్లి సెప్టెంబర్ 27: పట్టణం బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా దేశాన్ని దోచుకొని దాచుకున్న కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి కావాలనే ప్రధాని మోడీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. యూపిఏ1, యూపిఏ2 హయాంలో కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్ పార్టీ గా మారి బొగ్గు కుంభకోణం, మైనింగ్స్ కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ వంటి అనేక కుంభకోణాలు చేసి భారతదేశం పరువు మంటగలిపిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే, గత నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సబ్ కా సాద్ - సబ్ కి వికాస్ నినాదంతో అన్నివర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రాపేల్ ఒప్పందాన్ని కుంభకోణం మాదిరిగా చిత్రీకరిస్తున్నారని ఇది దొంగే పోలీస్ పోలీస్ అని అరుస్తున్నట్లు ఉందని ఎద్దేవాచేశారు. ఎవరి ప్రభుత్వాలు కుంభకోణలు చేసాయో దేశ ప్రజలకు తెలుస్తున్నదని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చేపతారని , ప్రధాని పై...