Posts

Showing posts from November, 2020

పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

Image
  జనం కోసం మనం న్యూస్: వారం రోజుల  క్రితం కోరుట్ల మండలం వెంకటాపూర్ లో జరిగిన రోడ్డు  ప్రమాదంలో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గుడికందుల శ్రీనివాస్ వారి కుటుంబంలో కుమారుడు సృజన్,  (16), కుమార్తె శృతి  లు తీవ్రంగా గాయపడ్డారు వీరికి చికిత్స నిమిత్తం కోరుట్ల జూనియర్ కాలేజ్ పూర్వ  విద్యార్థులు తమ వంతుగా                         ( రూ,,17000)ఆర్థిక సహాయం అందించారు స్నేహితులు ఎనగందుల రాజేందర్, వనతడుపుల మహేందర్, ఖలీద్ పాషా, తాలూక రాజేందర్,కలుసాని  రాజేశం,గనవేని  మల్లేష్, సామ లక్పతి,బద్దం  లక్ష్మి నారాయణ,మూడంపల్లి  రమేష్ లు అందించారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు  గనవేని  మల్లేష్ యాదవ్, ఖలీద్ పాషా,బద్దం  లక్ష్మి నారాయణ మూడం పల్లి రమేశ్ లింగస్వామి రవీందర్  తదితరులు  పాల్గొన్నారు..

మదర్ ప్రతిభ సేవ స్వచ్ఛంద పౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణ

Image
జనం కోసం మనం న్యూస్: మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో మదర్ ప్రతిభ సేవ స్వచ్ఛంద పౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి  ప్రారంభించడం జరిగింది.ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు ఇది చక్కటి అవకాశమని ఇలాంటి కార్యక్రమం మన గ్రామంలో ప్రారంభించినందుకు మదర్ ప్రతిభ ఫౌండేషన్ వారికి సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్ గారు కృతజ్ఞతలు తెలిపారు.మదర్ ప్రతిభ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీ లో సంస్థ సేవా కార్యక్రమాలు చేయుటకు ఆసక్తి ఉన్న మహిళలు కావాలని వారికి మా సంస్థ నుంచి ప్రతి నెల వేతనం ఇవ్వబడును.45 రోజుల్లో పూర్తి చేసుకున్న ప్రతి మహిళలకు 35 శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లు అందజేస్తామని మరియు సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి,కార్యదర్శి ముజీబ్,వార్డు సభ్యులు నాగార్జున రెడ్డి,మండల కో ఆర్డినేటర్ సురేఖ,జిల్లా కో ఆర్డినేటర్ సుమలత, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

ట్రాఫిక్ రూల్స్ తప్పుతే కేసులు తప్పదు జగిత్యాల పోలీస్

Image
  జగిత్యాల జిల్లా : అర్జున్ జనం కోసం మనం జగిత్యాల ప్రతినిధి ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ వాహనాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్., 10కంటే ఎక్కువ ఈ-చలాన్స్ పెండింగ్ ఉన్న వాహనాలపై చార్జ్ షీట్ దాఖలు చేసి సంబంధిత వాహన యజమానులు కోర్ట్ లో హాజరుపరచడం., 3 కంటే ఎక్కువ ఈ- చలాన్స్ పెండింగ్  ఉన్న వాహనాలను సీజ్ చేయడం., గత నాలుగు రోజులుగా సుమారు 2581 మoది వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ-చాలన్స్ ను పే చేసి వాహనాలు సీజ్ కాకుండా చూసుకోవడం జరిగింది., వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ వారి కి సహకరించాలి. జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు. ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విధించిన ట్రాఫిక్ ఈ-చాలన్స్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు తెలిపారు., ఇందులో భాగంగా జిల్లా లో గడించిన నాలుగు రోజులుగా సుమారు 2581మoది వాహనదారులు తమ యొక్క వాహనాల పై ఉన్న ఈ-చాలన్స్ ను చెల్లించి వాహనాల సీజ్ కాకుండా చూసుకోవడం జరిగిందని  ఇదే విధంగా తమయొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను సకాలంలో చెల్లిం

సాధన ఫౌండేషన్ అద్వర్యం బియ్యం పంపిణీ

Image
  జనం కోసం మనం న్యూస్ ఈ రోజు ఓబులాపూర్ గ్రామం లో సాదన పౌండేషన్ ఆధ్వర్యంలో జిట్టవేణి నర్సయ్య కుటుంబ కు 25 కిలోల బియ్యం ఇవ్వడము జరిగింది. ఓబులాపూర్ గ్రామం లో రెండు రోజుల క్రితం బర్లుమేపుతు జీవనం సాగించే జిట్టవేణి నర్సయ్య గారు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి మేమున్నామంటూ సాదన పౌండేషన్ కో ఆర్డినేటర్ చిట్యాల నవకాంత్ 25 కిలోల రైస్ బ్యాగ్ ఇవ్వడము జరిగింది మరియు వారికి భవిష్యత్ లోపౌండేషన్ ద్వారా ఆర్థికసహయం కూడా చేస్తానని తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ వారికి ఎల్లప్పుడు అండ గా వుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర రమేష్ మరియు మల్లాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, సాదన పౌండేషన్ కోఆర్డినేటర్ చిట్యాల నవకాంత్  పాల్గోన్నారు.

*బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం గా 45548 రూపాయలు అందించిన గ్రామస్తులు

Image
 *బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం గా 45548 రూపాయలు అందించిన గ్రామస్తులు* జనం కోసం మనం న్యూస్: మల్లాపూర్ మండలంలోని  కుస్థాపూర్ గ్రామానికి చెందిన కటికే రమేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని సర్పంచ్ సరికెల లక్ష్మి-మహిపాల్ దృష్టికి తీసుకువెళ్లారు.. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న రమేష్ మరణించడంతో భార్య ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. రమేష్ మరణం తో అనాధాలయిన పిల్లల్ని చూసి ఆ గ్రామానికి చెందిన వారు ఏదైనా సహాయం చేయలని దాతలు ముందుకు వచ్చారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వారు పరాయి దేశం అయిన దుబాయ్, మస్కట్,సౌదీ దేశాలకు వెళ్లిన వారు సహాయంగా పంపిన డబ్బులు, గ్రామంలో కొందరు దాతలు ఇచ్చిన డబ్బులు మొత్తం కలిపి 45548 వేల రూపాయలను సరికెల లక్ష్మి-మహిపాల్, జిందం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందజేశారు.