Posts

Showing posts from June, 2019

ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత.

Image
జనం కోసం మనం న్యూస్ హైదరాబాద్ *ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత..*             *బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూత..* *తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి* ఫిలిం నగర్.. న్యూస్ జనం కోసం మనం  అలనాటి మేటి నటి, దర్శకురాలు, నటుడు కృష్ణ భార్య విజయనిర్మల బుధవారం రాత్రి గుండెపోటుతో (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు. 20 ఫిబ్రవరి 1946లో జన్మించిన విజయనిర్మల ఏడేళ్ల వయసులో 'మత్స్యరేఖ' అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పదకొండేళ్ల వయసులో ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, త

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని సిర్పూర్ గ్రామం లో వేడుకలు

Image
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రివర్యుల కలల సాకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల్ సిర్పూర్ గ్రామం గ్రామపంచాయతీ లో రైతులకు, గ్రామస్తులకు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్  భుక్యా. గోవింద్ నాయక్ గారు,యం.పి.టి.సి ఎనుగు.రాంరెడ్డి గారు, ఉప సర్పంచ్ కర్రె.సాయి కుమార్ గారు,వార్డ్ సభ్యులు మరియు ,మిల్క.రాజారెడ్డి గారు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.

హైద్రాబాద్ లో 9 ఎండ్ల బాలిక పై అత్యాచారం

Image
జనం కోసం మనం న్యూస్ హైద్రాబాద్: వరంగల్ ఘటన మర్చిపోకముందే… హైదరాబాద్ రామాంతపూర్ లో మరో చిన్నారిపై అత్యాచారం జరిగింది. తొమ్మిది సంవత్సరాల బాలికపై లక్ష్మణ్(22) అత్యాచారం చేశాడు. రామాంతపూర్ లోని నిర్మాణం జరుగుతున్న ఓ బిల్డింగ్ లో… లక్షణ్ ఉప్పరి పని చేస్తున్నాడు. అదే బిల్డింగ్ కు చెందిన వాచ్ మెన్ రమణ కూతురిని లక్ష్మణ్ ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు.

ఐటీ పార్క్ నిర్మించాలి.

Image
జనం కోసం మనం న్యూస్ హైద్రాబాద్: హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఐటీ రంగం విస్త‌ర‌ణ‌లో భాగంగా కుత్బ‌ల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బౌరంపేట్‌, దుండిగ‌ల్ గ్రామాల ప‌రిధిలోని 500 ఎక‌రాలలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు రంగారెడ్డి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. ఐటీ పార్కు ఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఆ రెండు గ్రామాల అసైన్డ్ రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందేలా టీఎస్‌-ఐఐసీ త‌ర‌పున చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు ఆ సంస్థ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లును కోరారు. గురువారం టీఎస్‌-ఐఐసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ సంస్థ చైర్మ‌న్ గ్యాద‌రి బాలమ‌ల్లు, ఎండీ వెంక‌ట్ న‌ర్సింహారెడ్డితో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స‌మావేశ‌మై ఐటీ పార్కు ఏర్పాటుపై చ‌ర్చించారు.  హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ ఐటీ పార్కులను అభివ్ర‌ద్ధి చేయాల‌ని టీఎస్‌-ఐఐసీ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న క్ర‌మంలో కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు. ఐటీ పార్కు ఏర్పాటుకు బౌరంపేట్‌, దుండిగ‌ల్ గ్రామాల్లో 500

"స్నాప్ డీల్ షాపింగ్ మోసాలు"ఫ్రాడ్స్

జనం కోసం మనం న్యూస్:హైదరాబాద్ *ప్రజలకు విజ్ఞప్తి. మీరు స్నాప్ డీల్ వెబ్ సైట్ లో ఏవైనా వస్తువులు కొంటున్నారా లేదా కొన్నారా. జాగ్రత్త. మీరు సైబర్ నేరస్థుల వలలో పడి మోసపోవచ్చు* 📍స్నాప్ డీల్ వెబ్ సైట్ లో మీకు నచ్చిన వస్తువుని ఆర్డర్ చేస్తారు.  📍ఆ వస్తువు మీ వద్దకు చేరడానికి మీరు మీ పూర్తి అడ్రస్ (ఆఫీస్ లేదా ఇల్లు), మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కూడా ఇస్తారు. 📍మీ అడ్రస్ కి ఆ వస్తువు వస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. సంతోషం. 📍సరిగ్గా 2 లేదా 3 రోజుల తర్వాత మీకు ఒక అపరిచిత వ్యక్తి నుండి కాల్ వస్తుంది. మీ పేరు అడ్రస్ వివరాలు అన్ని చెప్పి మీరు స్నాప్ డీల్ లక్కి డ్రా లో ఒక 'కారు' గెలుచుకున్నారు అని చెప్తారు. 📍మీరు 4 రోజుల కిందటే స్నాప్ డీల్ లో వస్తువు కొన్నారు కాబట్టి, మీ అడ్రస్ వివరాలతో ఒక వ్యక్తి కాల్ చేసి కారు గెలుచుకున్నారు అంటే మీరు నమ్ముతారు. 📍మీరు నమ్మారంటే ముందుగా కారు రిజిస్ట్రేషన్, కారు డెలివరీ, టాక్స్ ఇలా రకరకాలుగా మీ నుండి డబ్బులు గుంజుతారు.  📍ఇది మోసం అని గ్రహించండి. స్నాప్ డీల్ మంచిదే కావచ్చు. కానీ మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్త

*సరికొత్త హంగులతో శారదా విద్యాలయం*

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండల్ రాఘవపేట్ న్యూస్ సరికొత్త హంగులతో 💐శారదా విద్యాలయం💐 గౌరవ పోషకులకు,విద్యాభిమానులకు నమస్కారాలు.. గత 11 సంవత్సరాలుగా రాఘవపేట గ్రామంలో నెలకొల్పబడి పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యానందిస్తూ,తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల,ఆదర్శ పాఠశాలల్లో సీట్లు సాధిస్తూ,అనుభవజ్ఞులైన బీఎడ్ కలిగిన ఉపాధ్యాయులతో యాజమాన్యమే నడుపుతున్న పాఠశాల "శ్రీ శారదా విద్యాలయం" నూతన యాజమాన్యం నేతృత్వంలో తిరిగి రేపు ప్రారంభం కాబోతోంది అని తెల్పుటకు సంతోషిస్తున్నాం..కావున మీ పిల్లలను మా పాఠశాల లో చేర్పించగలరని కోరుతున్నాము.

"బాలిక విద్య కోసం జె.యన్ వెంకట్ ఆర్థిక సహాయం"

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా:   ఈ  రోజునమిచ్చమ్మ ట్రస్ట్ ద్వారా డాక్టర్ వెంకట్  ఆధ్వర్యంలో గతంలో లో చిన్న మెటుపల్లి  కి చెందిన బొల్లె రవళి తండ్రి దేవయ్య పేదరికం వలన చదువుకునే స్తోమత లేక బీఎస్సీ నర్సింగ్ హోమ్ చదవలేక మధ్యలో ఆగి పోవడం వలన చదువును కొనసాగించడం కోసం జేయన్. వెంకట్ గారు ఆర్థిక సహాయం అందజేశారు రవళి నర్శింగ్ హోమ్ చదువు పూర్తి అయ్యే వరకు జేయన్. వెంకట్  ఆర్థిక సహాయం అందచేస్తానని ఈ రోజు చెక్కు ఇవ్వడం జరిగింది..ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంబల్ల సుదర్శన్ ,ఎంపీటీసీ.పంచరి విజయ్ ,శంకర్ గౌడ్ ఇంకా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు పోలీస్ ఆఫీసర్

Image
జనం కోసం మనం న్యూస్:  ఫ్రెండ్లీ పోలీస్ కి మరో రూపం మే శ్రీనివాస్   ఎన్నో సేవ కార్యక్రమలు ఆయన సాంతం డ్యూటీ లో ఉన్న ఎవరికి ఆపద ఉన్న అరక్షణం లో ముందు ఉంటాడు.అతడే వీరుడు మన శ్రీనివాస్ భాయ్ కి జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂🎂 🎂🎂

రోడ్ పక్కన అందరు చూస్తుగానే కత్తి తో దాడి

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా కోరుట్ల న్యూస్: కోరుట్ల పట్టణంలోని HDFC బ్యాంక్ దగ్గర బొమ్మేన గ్రామానికి చెందిన ముంజ గంగాధర్ గౌడ్ అనే వ్యక్తి పై కత్తితో దాడి చేసిన తాటికొండ రమేష్ అనే వ్యక్తి. డబ్బుల విషయంలో కత్తి దాడి జరిగినట్లు చెప్పిన గంగాధర్.. పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన రమేష్.

ఈద్ ముబారక్ సంబరాలు

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా న్యూస్:                                                             మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా బిష్మిళ్ల యూత్ ఆధ్వర్యంలో సేమ్యా పంపిణీ చేశారు. సాయంత్రం గ్రామ పంచాయతీ ముందు  రంజాన్ పాయసం ప్రజలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్తక్  ఇక్బాల్ , సోహెల్ , అమీర్ , రీజ్వన్ , ఇర్ఫాన్ , అజిత్ , సజీరుద్దీన్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు పోలీస్ ఆఫీసర్

Image
పోలీస్ కి మరో పేరు ఫ్రెండ్లీ పోలీస్.... నిజాయితీ కి మరో పేరు నిష్కళంకమైన మనసున్న మారాజు ముక్కుసూటితనం కి నిలువెత్తు నిదర్శనం .....జనం కోసం మనం న్యూస్  .......... అక్రమార్కుల పాలిట విక్రమార్కుడు సంతోష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂🎂💐💐 .................జనం కోసం మనం న్యూస్................